Friday 21 October 2011

పదోన్నతుల్లో వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్‌

వికలాంగ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పదోన్నతుల్లో 3 శాతం రిజర్వేషన్లు వర్తింపచేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ, వికలాంగుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం ఛాయారతన్‌ జీవో నెంబర్‌ 42 విడుదల చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని తెలిపారు. ఈ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు, సచివాలయం, వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలూ వర్తింపచేయాలని ఆదేశించారు. ప్రతి వంద పాయింట్లలో రోస్టర్‌ చట్రంలో నెంబర్‌ 6, 31, 56 పాయింట్ల వద్ద వికలాంగులకు పదోన్నతులు కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
యుటిఎఫ్‌ హర్షం
వికలాంగులకు పదోన్నతుల్లో 3 శాతం రిజర్వేషన్లు వర్తింపచేయడం పట్ల యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌ నారాయణ, ఐ వెంకటేశ్వరరావు గురువారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. వికలాంగ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుందన్నారు.