SERVICE /LEAVE RULES


THE FOLLOWING COVER THE SERVICE RULES OF THE GOVT EMPLOYEES WORKING IN THE STATE OF ANDHRA PRADESH
ANDHRA PRADESH (CONDUCT) RULES 1964 
ANDHRA PRADESH CIVIL SERVICES (CCA) RULES 1991
ANDHRA PRADESH GENERAL OFFICE PROCEDURE
ANDHRA PRADESH LAST GRADE SERVICE RULES 
ANDHRA PRADESH MINISTERIAL SERVICES 1998
ANDHRA PRADESH PENSION RULES 1980 
ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION REGULATIONS
ANDHRA PRADESH SECRETERATE SUBORDINATE SERVICE RULES 1996 
ANDHRA PRADESH STATE AND SUBORDINATE SERVICE RULES 1996

Civil Service Rules 1965Pensioners Life Certificate (New)
A.P. Civil Service Rules 1991Income Tax Circular released by 
Govt. of India (2009-10)
AP Civil Service Rules
Appendix-II
Subordinate Service Rules
AP State Subordinate Service Rules 1996
Appointment on Compassionate Grounds rules
Conduct Rules Annexure_1
Conduct Rules Annexure_2
Conduct Rules Annexure_2_1
Hand Book of Disciplinary Actions
Instruction on General Office Procedure
Role & Responsiblities of Teachers


ఇంక్రిమెంట్లు ఏ సందర్భంలో ఆవుతారు?
ఒక ప్రభుత్వోద్యోగికి ఇంక్రిమెంటు ఎప్పుడొస్తుంది? కొన్ని సందర్భాల్లో అది రాకుండా
అధికారులు ఆపుతుంటారెందుకు? ఏ సందర్భంలో దానిని ఆపాల్సి వుంటుంది?
తదితర సందేహాలను నివృత్తి చేసేదే సర్వీసు రూల్సులోని ఎఫ్‌.ఆర్‌-24. ఉద్యోగి విధులు
సక్రమంగా నిర్వహించనప్పుడు. అతని/ఆమెప్రవర్తన సరిగ్గా లేనప్పుడు తగిన ఆధారాలతో
అది రుజువైనప్పుడు మాత్రమే ఇంక్రిమెంటును ఆపుదల చేసే అవకాశం ఉంటుంది.

F R 24 says
An increment shall ordirarily be drawn as a matter of course unless it is with held.
An increment may bewith held from good Servent by the state Govt, or by any
authority of whom the state good. may delegatethis power if conduct has not been
good or his work has not been satisfactory. In ordering the with holding
of an increment the with holding authority shoud state the period for which it is
with held and thepostponement shall have the effect of postponing future increment.

ప్రభుత్యోగి విధులు సరిగ్గా నిర్వహించలేప్పుడో, మరే ఇతర కారణాలవల్ల అతనిపై క్రమశిక్షణా
చర్యలుతీసుకోదల్చుకున్నప్పుడో తప్ప మరే ఇతర సందర్భాల్లోనూ ఇంక్రిమెంటు ఆపకూడదని
సర్వీసు రూల్సులోనిఎఫ్‌.ఆర్‌. 24 పేర్కొంటున్నది. ఇలాంటి సందర్భంలో క్రమ శిక్షణా చర్యలను
ప్రభుత్వంగానీ, అధికారులుగానీతీసుకోవచ్చు. ఇంక్రిమెంటును ఆపే శిక్ష విధించవచ్చు.
అయితే ఈ సందర్భంగా ఇచ్చే ఉత్తర్వులో ఇంక్రిమెంటుఎందుకు ఆపుతున్నారు?
ఎన్ని రోజులు ఆతపుతున్నారు? అనే వివరాలు కూడా పొందుపర్చాల్సి వుంటుంది.
సివిల్‌ సర్వీసెస్‌, క్లాసిఫికేషన్‌ కంట్రోలు అప్పీలు రూల్స్‌- 1991 ప్రకారం. ఏ అధికారికి ఒక
ఉద్యోగిపై క్రమశిక్షణాచర్యలు తీసుకోవడానికి అధికారముందో, ఆ అధికారి ఇంక్రిమెంటును
ఆపివేయవచ్చు. ఇంక్రిమెంటునుఆపివేయాలంటే civil sevices classfication control appeal
date 24. 9. 1991. ప్రకారం చర్య తీసుకోవాలి.ఇంక్రిమెంటు ఆపివేసే ఉత్వర్వులలో ఎంతకాలం
ఇంక్రిమెంటును ఆపి వేయాలనే కాల నిర్ణయాన్ని తప్పకుండా పొందుపర్చాలి.
అలా చేయకపోయినట్లయితే, ఆ ఉత్తర్వును అమలు చేయాల్సిన అవసరం లేదు.
G.o.m.s No. 12 fin and plg FR I Dept Date 7.2.95 see note 1 and 2 under FR 24
and ruling 192)10 క్రమశిక్షణా చర్యల కింద ఇంక్రిమెంటు ఆపి వేయాలని నిర్ణయానికి
వచ్చినప్పుడు, పెన్షన్‌పై దాని ప్రభావాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి. ఒకవేళ పెన్షన్‌పైనా
దాని ప్రభావం పడుతుందనుకున్నప్పుడు ఉత్తర్వులో ఆ వివరాలనూ తెలియజేయాలి.
(Ruling 4 (a) under FR24)ప్రభుత్వ ఉద్యోగిని misconduct గా పరిగణించి చర్య తీసుకొని,
సస్పెండు చేసినప్పుడు, సస్పెండయిన కాలమేగాక,అంతకు ముందు ఆ ఉద్యోగి పెట్టిన సర్వీసు
కూడా ఇంక్రిమెంటు ఇచ్చే కాలానికి కలవదు.
ఉదాహరణకు ఒక ఉద్యోగి ఇంక్రిమెంటు ప్రతి సంవత్సరమూ మే ఒకటో తేదీన
వస్తుందనుకుందాం. తేదీ: 1.5.2007కు ఇంక్రిమెంటు ఇచ్చాం.
ఈ ఉద్యోగి ఆగష్టు 2007లో misconduct పై సస్పెండు అయ్యాడు. ఈ సందర్భంలో ఆగష్టునుండి
వచ్చే కాలమేగాకమే 1.5.2007 నుండి ఆగష్టు వరకు వచ్చే మొత్తం కాలం కూడా కలవదు.
ruling రూలింగ్‌ 5 (a), 26 under FR 24) ఇంక్రిమెంటు సర్టిఫికెట్‌ సరైన ఫారములో పూర్తిచేసి
డ్రాయింగు ఆఫీసరు సంతకం చేసి 'పే' బిల్లుకు తగిలించి అకౌంట్సు ఆఫీసుకుగానీ,
ట్రెజరీకిగానీ పంపాలి. ఈ సర్టిఫికెట్‌ లేకుంటే ఇంక్రిమెంటు శాంక్షన్‌ చేయడానికి వీల్లేదు.
బిల్లు కూడా పాసుకాదు.(ruling 5 (a) under FR24)Rull 9 of Ap civil seviece classification
control andappeal rule 91 91 ప్రకారం without cumulative effect అనే శిక్ష మైనరు (చిన్న) శిక్ష.
with cumulative effectఅనే శిక్షలో మేజరు (పెద్ద) శిక్ష. ఈ శిక్షలు విధించినప్పుడు, ఇది ఎంతకాలం
అమలులో ఉంటుందో అంతకాలం ఆ ఉద్యోగి ప్రమోషన్‌కు అనర్హుడవుతాడు. ఇంక్రిమెంటు ఆపే
ఉత్తర్వులు ఇచ్చేనాటికి ఒక ఉద్యోగి ఇంక్రిమెంటుకు అర్హుడయితే ఆపటానికి వీల్లేదు.
(increment already accrued cannot be stopped) అయితే ముందుగా క్రమశిక్షణా
చర్యలు తీసుకున్న అధికారి డ్రాయింగు ఆఫీసరుకు ఏ విధమైన శిక్ష విధించబోతున్నారో
తెలియజేసి  ఇంక్రిమెంటును ఆపి వేయవచ్చు.
1.G.o.m.s.No. 342 G.A Depot Date 4.8. 1997
2.Circular memo No 34633 ser c 99 G a.ser c and date 4.11.1999.
ఇంక్రిమెంట్లు మంజూరులో జాప్యం జరుగకుండా తగిన సమయంలో శాంక్షన్‌ చేసేందుకు
వీలుగా ప్రభుత్వం ఇంక్రిమెంటు వాచ్‌ రిజిష్టరును ఈ కింద కనబర్చిన నమూనాలో ప్రవేశపెట్టింది.
ఈ రిజిష్టరు ప్రతి ఆఫీసులో పెట్టాలి. ఇంతకుముందు పేరాలో చెప్పినట్లుగా 12 నెలలకు
(జనవరి నుండి డిశంబర్‌ వరకు) ఒక్కొక్క నెలకు ఒక పేజీ గానీ,
రెండు పేజీలుగానీ అవసరాన్నిబట్టి కేటాయించాలి. ఇప్పుడు ఉద్యోగి ఏ మాసంలో, ఏ తేదీకి
ఇంక్రిమెంటు వచ్చే తేదీ అయినా మొదటి తేదీ నుండి ఇంక్రిమెంటు శాంక్షన్‌ చేయాలి. ఆఫీసులో
పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసు రిజిష్టరును  పరిశీలించి ఏయే మాసంలో ఏయే ఉద్యోగికి ఇంక్రిమెంటు
వస్తుందో ఆయా మాసపు పేజీలలో డ్రాయింగు ఆఫీసరు నమోదు చేయాలి/చేయించాలి. ఏ ఉద్యోగి
అయినా బదిలీ అయినప్పుడు అతని సర్వీసు రిజిష్టరు పరిశీలించి ఇంక్రిమెంటు తేదీని, ఏ మాసంలో
వస్తుందో, ఆ మాసం పేజీలో నమోదు చేయాలి. ఈ రిజిష్టరును సక్రమంగా
మెయిన్‌టెన్‌ చేయటం ఆ ఆఫీసులోని డ్రాయింగు ఆఫీసరు బాధ్యత.
ఇంతకు ముందు పేరాలో వివరించిన విధంగా ఏ మాసంలో అయినా, ఏ తేదీకి ఇంక్రిమెంటు
వచ్చినా, ఆ మాసం మొదటి తేదీ నుండి ఇంక్రిమెంటు శాంక్షన్‌ చేసి డబ్బులు చెల్లించాలి. 'పే బిల్లు
రాసేముందు, డ్రాయింగు ఆఫీసరు ఇంక్రిమెంటు వాచ్‌ రిజష్టరులోని పేజీని (తేదీ, నెల, సంవత్సరంతో సహా)
చూసి, ఆ పేజీలో ఉన్న వారందరికీ ఇంక్రిమెంటు శాంక్షన్‌ చేసి, ఇంక్రిమెంటు సర్టిఫికెట్‌ పూర్తిచేసి,
సంతకం చేసి, పే బిల్లుకు జత పరచి, పే అకౌంట్సు ఆఫీసుకుగానీ, ట్రెజరీకిగానీ పంపి, డ్రా చేసి
డబ్బులు చెల్లించాలి.