SERVICES

  • Regularisation&probation declaration of SA &LFL of all divisions-prakasam(dist)
  • Regularisation&probation declaration of LP(TP&HP)-Kandukur division of prakasam dist 
  • regularisation &probation declaration of LP(HP&TP)-Markapur division of prakasam dist 
  • Ongole division of prakasam dist 
  • Medical Reimbursement Status (Online) at Hyderabad
  • List Of Recognized Private Hospitals(Uptodate)
  • Pay Revision Commission Recommendations 2009 on Medical Reimbursement                     G.O. Ms. No. 68       Dated 28th  March, 2011-Download
  •  16 points guidelines for sending medical reimbursement proposals -Download  
  • GO Ms No.74   Dt.15-03-2005( On Medical Reimbursement )  

    టీచర్ల సమస్యలు  ( ఏకీకృత సర్వీసు రూల్స)

     1998లో ప్రభుత్వ ఉపాధ్యాయులను , స్థానిక సంస్థల ఉపాధ్యాయులను కలిపి ఉమ్మడి సీనియారిటీ అమలు చేయుటకు జీవోలు 505, 538 లను ప్రభుత్వం ఇచ్చింది. కానీ 2003 సెప్టెంబర్ 18న హైకోర్టు తీర్పు ఇస్తూ రాజ్యాంగం 371 (డి) ఆర్టికిల్ ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీసును  లోకల్ కాడర్ గా రాష్ట్రపతి చేత ప్రకటించబడియున్నందున , అట్లా లోకల్కాడర్ గా పరిగణించని పంచాయితీరాజ్ ఉపాధ్యాయుల సర్వీనుతో ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీసును  కలుపరాదని  “ తీర్పు ఇస్తూ ఆ జీవోలు ( 505, 538 ) కొట్టివేసింది.ఏకీకృత సర్వీసుల కోసం రాష్ట్ర  ప్రభుత్వం  పంచాయితీరాజ్ ఉపాధ్యాయులను లోకల్ కాడర్ గా ఆర్డినెన్సు తెచ్చి , జీవోలు 95, 96 జారీ చేసి  ఆ తర్వాత చట్టం చేసింది.  మరలా హైకోర్టు ఆ జీవోలను కొట్టివేస్తూ స్థానిక కేడర్లను తనంతట తాను సృష్టించడం గానీ , రద్దు చేయడంగానీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని , ఏది జరిగినా రాష్ట్రపతి అనుమతి అనంతరమే జరగాలని  కనుక స్థానిక సంస్థల ఉద్యోగులు లోకల్ కేడర్లు గా పరిగణించరాదని , ఏకీకృత సర్వీసుల చట్టం సంబంధిత జీవోలు  95, 96  చెల్లవని హైకోర్టు తీర్పు ఇచ్చింది.ఆరు అంశాల సూత్రం   1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం,  1971లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ల ప్రభావం వలన కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి రెండు ప్రాంతాలు సమైక్యంగా  ఒకే రాష్ట్రంగా కొనసాగడానికి , తెలంగాణాతోసహా ఇతర వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి , ఆ ప్రాంతాల ఉపాధి అవకాశాలు మరియు విద్యా సౌకర్యాల మెరుగుకై ఆరు అంశాల సూత్రం ( సిక్స్ పాయింట్ ఫార్మూలా ) రూపొందించి అమలు చెయ్యాలని 21-9-1973 నాడు రాష్ట్రానికి అందజేసింది. ఆరు అంశాల సూత్రం లో భాగంగా ది.3-5-1974 నాడు 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371-డి , ఆర్టికల్ 371-ఇ లను కొత్తగా చేర్చారు. ఆర్టికల్ 371 డి   రాజ్యాంగం ప్రకారం ఇంతవరకు కులపరంగా రిజర్వేషన్ కు అవకాశమున్నది కానీ ఈ ఆర్టికల్ ప్రకారం స్థానిక నివాసం ఆధారంగా రిజర్వేషన్ కల్పించడానికి అవకాశం కలిగింది. ఈ ఆర్టికల్ ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది. జీవో 674 ద్వారా 20-10-1975న ప్రత్యేక ఆదేశాలను రాష్ట్రపతి జారీచేశారు. 27నెలలలోపల రాష్ట్రంలోని వివిధ పోష్టులను ప్రత్యేక లోకల్ క్యాడర్లుగా ఏర్పాటు చెయ్యాలి. ఈ విధంగా ఏర్పాటైన లోకల్ కాడర్ ఆయా కేటగిరీ పోష్టులకు నియామకానికి, సీనియారిటీ, ప్రమోషనుకు , బదిలీకి , ఉద్వాసనకు ఒక ప్రత్వేక యూనిట్ గా పరిగణింపబడుతుంది. అయితే 17-1-1978నాటికి గడువు ముగిసింది.  ప్రభుత్వ ఉపాధ్యాయులను జీవో నెం. 529 ద్వారా 14-5-1976నుండి లోకల్ కేడర్ గా ప్రకటించింది. గడువు ముగిసిన తర్వాత కూడా రాష్ట్రపతి ఏ పోష్టులనైనా ఆయా ప్రాంతాల్లో లోకల్ కేడరుగా ప్రకటించవచ్చు. జూనియర్ అసిస్టెంటు , అంతకు తక్కువ స్థాయ గల పోష్టులను జిల్లా స్థాయి కేడరుగా ఏర్పాటు చేశారు. పాఠశాల విద్య సబార్డినేటు సర్వీసు నుంచి సెకండరీ గ్రేడు, స్కూలు అసిస్టెంటు పోష్టులసు 1-1-1974 నుండి ప్రతి జిల్లా ఒక ప్రత్యేక లోకల్ ఏరియాగా పరిగణించాలని జీవో106(ఇ) ద్వారా ది.4-2-2000 న రాష్ట్రపతి ఉత్తరువులకు సవరణ తెచ్చారు. ఇటువంటి సవరణ ఉత్తరువును  పంచాయితీరాజ్ ఉపాధ్యాయుల విషయంలో తేవడం మరచారు. ఆ తర్వాత తెద్దాం లెమ్మని నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించారు. రాష్ట్రం లోని 23 జిల్లాలను 6 జోన్లుగా ( ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అన్నట్లుగా) విభజించారు. 1981లో పంచాయితీరాజ్ ఉపాధ్యాయులను ప్రొవిన్షియలైజ్ చేశారు, కానీ లోకల్ కేడర్ గా పరిగణింపలేదు. రాష్ట్రపతి ఉత్తర్వులు లేకుండా జీవోలు ఇచ్చినందున  1992లో, 1998లో, 2005లో ఇచ్చిన  ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది.రాష్ట్రపతి ఉత్తర్వులలో ప్రభుత్వ,మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని గజిటెడ్, నాన్ గజిటెడ్ ఉపాధ్యాయుల పోష్టులను లోకల్ కేడరుగా మార్చే క్లాజు చేర్చాలని , రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేసుకొనే అధికారం రాష్ట్రానికి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు ఉన్నది కాబట్టి ఈ ప్రతిపాదన పరిశీలించడం సాధ్యపడదని కేంద్రం అంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపండి అని ఒక్కమాట చెప్పడానికి 1973 నుండి 2007 వరకు నోరు రాని ప్రజాప్రతినిధులకు విద్య పట్ల ఎంత ఆసక్తి వుందో తెలియడంలేదా 
    ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా, మండల పరిషత్‌ల పాఠశాలల ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్సు సమస్య గత నాలుగేళ్ళుగా పాఠశాల విద్యారంగాన్ని అనిశ్చిత స్థితిలోకి నెట్టింది. న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నందున డిఇఓ పోస్టులను భర్తీ చేయలేని స్థితి నెలకొంది. ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్‌ పాఠశా లల బోధనా సిబ్బందికి కామన్‌ సీనియారిటీ ప్రకారం పదోన్నతి కల్పించాలని 1981 నుంచి ఉపాధ్యాయులు కోరుతున్నారు.
    మూడు లక్షల మంది ఉపాధ్యాయులు ఎదుర్కొంటోన్న ఈ సమస్య దాదాపు మూడు దశాబ్దాలుగా అపరిష్క­ృతంగా ఉండిపోయింది. ఏకీకృత సర్వీసు రూల్సు పై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటి షన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం నాడు విచారణ చేపట్టినప్పుడు సంబంధిత ఫైలు రాష్ట్రపతి ఆమోదం పొందేదశలో ఉన్నందున కేసు ను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో వ్యవహారం మళ్ళీ వాయిదాపడింది. ఆ ఫైలును ఆమోదింప చేయడానికి ముఖ్య మంత్రి స్వయంగా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
    రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక స్వపరిపాలనా సంస్థలు, పంచాయితీరాజ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరినీ ఒకే యాజమాన్యం క్రిందకు తెచ్చి పాఠశాలలో పర్యవేక్షణను పటిష్టం చేయడం, బోధనా సిబ్బందిలో జవాబుదారీతనాన్ని పెంచడం ద్వారా విద్యా వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అనువైన వాతావరణాన్ని కల్పించడానికి ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ ఎంతైనా దోహదం చేస్తాయి.
    అంతేకాక ఉపా ధ్యాయులందరికీ అర్హతలు, సీనియారిటీని బట్టి డైట్‌, జూనియర్‌ కళా శాలల అధ్యాపకుల స్థాయివరకు పదోన్నతి కల్పించడానికి కూడా కామన్‌ సర్వీస్‌ రూల్స్‌ ఉపయోగపడతాయి. కొఠారి కమిషన్‌ నాలుగు దశాబ్దాల క్రితం చేసిన సూచనను అమ లుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు 1998లో పూనుకొంది. ఆ మేరకు ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ను రూపొందించి అమలుపరిచింది.
    అయితే పదోన్నతుల విషయమై కొందరు, రాష్ట్రంలో ప్రభుత్వ సర్వీ సులకు సంబంధించిన ప్రత్యేక పరిస్థితులు, రాజ్యాంగ రక్షణలు, ఆరు సూత్రాల ప్రకారం స్థానిక రిజర్వేషన్లు తదితర సాంకేతికాంశాలపై మరికొందరు కోర్టుకెక్కారు. దీంతో ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌కు సంబం ధించి రాష్ట్ర ప్రభుత్వం 1998లో జారీ చేసిన 505, 538 జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ‘రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు లోకల్‌ కేడరుగా ఆర్గనైజ్‌ అయిన ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీసులను, లోకల్‌కేడర్‌ గా ఆర్గనైజ్‌ కాని జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఉపాధ్యాయుల సర్వీసులను కలిపివేయడం సరికాద’ని పేర్కొంటూ ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ను హైకోర్టు కొట్టివేసింది.
    ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్‌ను అమలు చేయడానికి హైకోర్టు తీర్పులో పేర్కొన్నమేరకు జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఉపాధ్యాయుల సర్వీ సులను లోకల్‌ కేడర్‌గా ఆర్గనైజ్‌ చేయించుటకు రాష్ట్ర పతి అనుమతి కోరడం, అనంతరం రెండు సర్వీసులకు కలిపివేయ డం అసాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించి కేంద్ర ప్రభుత్వానికి తగు ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు వెంటనే చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఏకీకృత సర్వస్‌ రూల్స్‌ చట్టాన్ని చేసి, ఏకీకృత సర్వీసు ల అమలు జీవోలు 95, 96లను జారీచేసి కొనసాగించింది.
    ఈ చట్టాన్ని, ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ను కూడా తొలుత ట్రిబ్యునల్‌, ఆ తరువాత హైకోర్టు కొట్టివేశాయి. ఈ సందర్భంగా హైకోర్టు గతంలో ఉమ్మడి సర్వీసుల పై చేసిన వాదననే చేస్తూ రాష్ట్రపతి అనుమతి లేకుండా లోకల్‌ కేడరుగా ఆర్గనైజ్‌ చేయబడిన ప్రభుత్వ ఉపాధ్యా యుల సర్వీసులను రద్దు చేయడం గాని, ఏకీకృత సర్వీసులను రూపొందించడం గాని సరికా దని స్పష్టం చేస్తూ 2006 మార్చిలో ఆ చట్టాన్ని, జీవోలను కొట్టివేసిం ది. ఈ తీర్పు ప్రకారం లోకల్‌ కేడరుగా ఆర్గనైజ్‌ అయిన ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీసుల రద్దుకు, ఉమ్మడి గా కొత్త సర్వీసులను రూపొందించుటకు తగు అనుమతులు ముందుగా పొందడం గాని చేయాలి.
    ఈ రకంగా హైకోర్టు తీర్పుకు అనుకూలమే గాని, వ్యతిరేకం కాదు. అయితే హైకోర్టు తీర్పుపై రెండు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్స్‌ సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నప్పటి కీ హైకోర్టు తీర్పుకు అనుగుణంగా చేసే చర్య కనుక సుప్రీం కోర్టుకు కూడా అభ్యంతరం ఉండదు. కాగా పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయుల సర్వీను లోకల్‌ కేడర్‌గా పరిగణించుటకు కేంద్ర హోంశాఖ అనుమ తించాల్పి వుంది. ఆ అనుమతితోనే ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ సాధ్యమ వుతాయి. లేదా ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్‌ ఉపాధ్యాయుల సర్వీస్‌లను రద్దు చేసి వాటిని ఏకీకృతం చేయడానికి కేంద్ర హోంశాఖ అనుమతించాలి. ఇవి ఏమై నా హైకోర్టు తీర్పు మేరకు జరిగే చర్యలే.
    ఎప్పుడైతే ఉమ్మడి సర్వీసు రూల్స్‌ అమలులోకి వస్తాయో అప్పుడే ఉమ్మడి సీనియారిటీకి అవకాశముంటుంది. ఉమ్మడి సీనియారిటీ అమలులోనికి వస్తే ప్రభుత్వ పంచాయితీ రాజ్‌ పాఠశాలలన్నీ విద్యాశాఖ పరిధిలోనికి వస్తాయి. ఒకే పర్యవేక్ష ణాధికారి అదుపులో ఉండి జీతాలు, సర్వీసు కండిష న్లు కూడా ఈ పర్యవేక్షణాధికారి పరిధిలోనికి వచ్చి ఉపాధ్యాయులను నేరుగా అజమాయిషీ చేసే అవకాశ ముంటుంది. గతంలో పాఠ్య బోధనకు సంబంధించిన పర్యవేక్షణాధికారం విద్యాశాఖకు, వేతనాలు, సర్వీసు విషయాలన్నీ జిల్లా, మండల పరిషత్‌ అధికారులకు ఉండేవి. దీనివలన ద్వంద్వ పాలన ఉండి జవాబుదారీ తనం లోపించటం, స్థానిక రాజకీయాలతో పాఠశాల లు భ్రష్టు పట్టిపోవడం జరిగిందనేది అనుభవం.
    2005 సంవత్సరం నుంచి జీతాల చెల్లింపు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా జరుగుతోంది. కనుక ఏకీకృత సర్వీసులు అమలైతే ప్రభుత్వ విద్యాశాఖ అజమాయిషీ పెరిగి జవాబుదారీతనం వస్తుం ది. పాఠశాలలన్నింటిని ఒకే గొడుగు క్రిందకి తెచ్చి ఒకే రకమైన సర్వీస్‌ రూల్స్‌ వర్తింప చేయాలనడం ప్రజాస్వామిక డిమాండ్‌. ఆ క్రమంలో ప్రస్తుతం ప్రభుత్వ, పంచాయితీరాజ్‌ ఉపాధ్యాయులను ఒకే సర్వీస్‌ రూల్స్‌ పరిధిలోనికి తేవడం ద్వారా ఈ డిమాండ్‌ పాక్షికం గా అమలు జరుగుతోంది. ప్రపంచీకరణ, నూతన ఆర్థిక విధానాల ను ప్రభుత్వాలు అనుసరిస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వరంగ సంస్థల ను ప్రైవేటీకరణ ద్వారా బాధ్యతలను వదిలించుకుంటున్న ప్రస్తుత సందర్భంలో పేద, దళిత, వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్యగంధా న్ని అందిస్తున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టమైన పర్యవేక్షణ, జవాబుదారీతనంతో పరిరక్షించుకోవాలి. అందుకు ఏకీకృత సర్వీసు లు దోహదపడతాయి.
    source : aandhrajyothy 12 april 2008